Share News

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:38 PM

ఆదాయంలో ఏపీఎస్‌ఆర్టీసీ రికార్డ్‌ నెలకొల్పింది. జనవరి 19న అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చింది.

APSRTC: రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ
APSRTC

అమరావతి, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్‌ సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు.


సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రత్యేక బస్సులు నడిపి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఈ అసాధారణ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులందరినీ ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.


కాగా.. సంక్రాంతి తిరుగు ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు.. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. బస్సు షెడ్యూల్స్‌ను పెంచడం, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్ బుకింగ్‌లను సులభతరం చేయడం వంటి చర్యలతో ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి...

దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి

తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 01:35 PM