Medchal News: దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:05 AM
కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
హైదరాబాద్, జనవరి 20: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి రజినికి వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన కొడుకు పక్కాగా ప్లాన్ వేశాడు. సదరు వ్యక్తిని ఇంటికి పిలిచి మద్యం తాగించాడు. ఆ తర్వాత గొడవ చేసి మరీ ఆ వ్యక్తిని చంపేందుకు యత్నించాడు.
అయితే.. ఆ ప్రయత్నాన్ని అతడి తల్లి అడ్డుకోబోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. కన్నతల్లి అని చూడకుండా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రజినిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకుతో పాటు మరో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్
Read Latest Telangana News And Telugu News