Share News

Travels Bus Accident: కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 12 మందికి గాయాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 09:41 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.

Travels Bus Accident: కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 12 మందికి గాయాలు
KVR Travels Bus Accident

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20: రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళుతున్న KVR ట్రావెల్స్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.


ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు అశ్వారావుపేట దాటి సుమారు 20 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత గట్టుగూడెం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడినట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను పోలీసు వాహనాలు, అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 10:20 AM