డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
కుట్రతోనే బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను.. తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం లేకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సత్తుపల్లిలో బీసీ బంద్లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.