Share News

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:38 PM

భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్తగూడెం కార్పొరేషన్ అంశంపై చర్చించిన నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌పై వీడిన ఉత్కంఠ..
Kothagudem Corporation

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి సమావేశం కావడంతో ఉత్కంఠకు తెరపడింది. కొత్తగూడెం కార్పొరేషన్ అంశంపై చర్చించిన నేతలిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. మేయర్ పోస్ట్ సీపీఐకి, డిప్యూటీ మేయర్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ అంశం ఓ కొలిక్కి వచ్చింది. కాగా, ఈ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు ఈనెల 11న ఎన్నికలు జరగ్గా.. 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.


అదంతా తప్పుడు ప్రచారం..

మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ 8 డివిజన్లను సొంతం చేసుకుంది. అయితే, వారంతా కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆ 8మంది కార్పొరేటర్లు స్పందించారు. మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం చెప్పిందే తమకు శిరోధార్యమంటూ తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అమ్ముడు పోయారంటూ చేసే ప్రచారం అవాస్తమంటూ వీడియో విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం!

మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Feb 14 , 2026 | 09:51 PM