Share News

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం!

ABN , Publish Date - Feb 14 , 2026 | 08:02 PM

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది..

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం!
Hyderabad Formula E Case

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు (Formula E car Race case) కేసు కీలక మలుపు తిరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూషన్(Prosecution) చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) నుంచి అధికారికంగా అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్‌ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా-ఈ రేసింగ్ ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్ కుమార్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వడంతో.. ఇప్పుడు ఏసీబీ ఆయనపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ పొందింది. కాగా, ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌ ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 08:36 PM