Share News

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:35 AM

మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది.

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
Telangana SEC

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక ప్రకటన జారీ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటుహక్కుపై స్పష్టతనిచ్చింది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం.. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు హక్కు తప్పనిసరి అని తెలిపింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కానివారు ఓటు వేసేందుకు అనర్హులని సీఈసీ స్పష్టం చేసింది.


హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకుండా ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటువేసే వారిని అనర్హులుగా పరిగణిస్తారని, వారి ఓట్లు చెల్లవని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సీఈసీ సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో స్థానిక ఓటు హక్కు ఉంటేనే ఎంపీలు, ఎమ్మెల్సీలు.. మేయర్/ఛైర్‌ పర్సన్ పదవుల ఎన్నికల్లో ఓటువేసి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 09:56 AM