Home » Election Commission
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో జరుగుతోంది.
ఓటర్ జాబితా సంబంధిత విధుల్లో పాల్గొనే బీఎల్ఓ, సూపర్వైజర్ల పారితోషికాన్ని ఈసీ పెంచింది. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు హానరేరియమ్‌ను కూడా ప్రకటించింది.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న పలువురు బీఎల్ఓలు తీవ్రమైన పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడు వారాల్లో 16 మంది మరణించినట్టు కథనాలు రావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది.
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్‌ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.
చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.