Share News

Madhya Pradesh SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు

ABN , Publish Date - Dec 23 , 2025 | 06:15 PM

మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.

Madhya Pradesh  SIR: మధ్యప్రదేశ్‌ ఎస్ఐఆర్‌లో 42 లక్షల ఓట్ల తొలగింపు
Madhya Pradesh Eletoral rolls

భోపాల్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఎన్నికల జాబితా (Draft Electoral rolls)ను ఎన్నికల కమిషన్ (EC) మంగళవారంనాడు విడుదల చేసింది. ఆ వివరాలను మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ముసాయిదా జాబితాలోని వివరాల ప్రకారం 42.74 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 19.19 లక్షల మంది పురుషులు, 23.64 లక్షల మంది మహిళలు ఉన్నారు.


మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు. షిఫ్ట్ అయిన, గైర్హాజరైన ఓటర్లు 31.51 లక్షల మంది ఉండగా, 8.46 లక్షల మంది ఓటర్లు మృతి చెదారని, 2.77 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్లు పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు.


రాజధాని నగరమైన భోపాల్‌లో ఎస్ఐఆర్ అనంతరం 4,38,875 మంది ఓటర్లను తొలగించారు. అత్యధికంగా ఓటర్లను తొలగించిన నియోజకవర్గాల్లో గోవింద్‌పుర, నరేలా ఉన్నాయి. గోవిందపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 97,052 మంది ఓటర్లను తొలగించగా, నరేలా నియోజకవర్గంలో 81,235 మంది ఓటర్లను తొలగించారు. సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 67,304 ఓటర్ల పేర్లను తొలగించారు. నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో 51,058, సౌత్-వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 64,432, హుజూర్ నియోజకవర్గంలో 65,891, బైరాసియా నియోజకవర్గంలో 12,903 మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. కాగా, 2026 జనవరి 22 వరకూ అర్హులైన ఓటర్లు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేస్తుంది.


ఇవి కూడా చదవండి..

దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా

మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2025 | 06:17 PM