Share News

Sheikh Hasina: దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:27 PM

దీపూదాస్‌పై తప్పుడు అభియోగాలు మోపారని, మహమ్మద్ ప్రవక్తను అవమానించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని షేక్ హసీనా ఒక ఆడియా ప్రకటనలో షేక్ హసీనా పేర్కొన్నారు.

Sheikh Hasina: దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా
Sheikh Hasina

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపూదాస్‌ (Dupu Das)ను మత ఛాందసవాదులు అత్యంక పాశవికంగా పొట్టనపెట్టుకోవడంపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యూఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ, పలు హిందూ సంస్థల కార్యకర్తలు మంగళవారంనాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీపూదాస్‌పై మూకదాడి ఘటనను పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.


దీపూదాస్‌పై తప్పుడు అభియోగాలు మోపారని, మహమ్మద్ ప్రవక్తను ఆయన అవమానించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని షేక్ హసీనా ఒక ఆడియా ప్రకటనలో పేర్కొన్నారు. అదొక్కటే కాదు..ఇంత పాశవికంగా దీపూదాస్‌ను హత్య చేసిన వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారు? అని ప్రశ్నించారు. దీపూదాస్ కుటుంబ సభ్యులు గుండెనిబ్బరం చేసుకోవాలని, తాను బతికున్నంత వరకూ ఈ దారుణ ఘటనపై న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


ఉద్యమం ఉధృతం చేస్తాం

బంగ్లాదేశ్‌లో దీపూదాస్ దారుణ హత్యపై ఆ దేశంలోనే కాకుండా ఢిల్లీ నుంచి ఖాట్మండు వరకూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీపూదాస్ హంతకులను యూనుస్ ప్రభుత్వం శిక్షించకుంటే మరింత పెద్ద ఉద్యమం చేపడతామని నిరసనకారులు హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనతో గత ఏడాది పదవీచ్యుతురాలైన షేక్ హసీనా అప్పట్నించి భారతదేశంలోని అజ్ఞాత ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండగా, షేక్ హసీనా పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా యూనుస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బంగ్లాలో కాల్పులు, పాశవిక హత్యలు, హింసాకాండలు చోటుచేసుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

రాజ్యాంగం రద్దుకు బీజేపీ నేతల కుట్ర: రాహుల్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2025 | 05:32 PM