Home » Bangladesh
బంగ్లాదేశ్లో అల్లరి మూకలు రభస సృష్టించడంతో ప్రముఖ సింగర్ జేమ్స్ తలపెట్టిన సంగీత కార్యక్రమం శుక్రవారం రద్దయిపోయింది. ఉన్మాదంతో రెచ్చిపోయిన అల్లరి మూకలు ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో నిర్వాహకులు కాన్సర్ట్ను క్యాన్సిల్ చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను, హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో పాపం అనుకున్నా భారతీయులు, పొరుగు దేశం బంగ్లదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
దీపు చంద్ర దాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. రాజ్బరి జిల్లాలో ఓ వ్యక్తిపై కొంత మంది దాడి చేశారని...
దీపు చంద్రదాస్ సంఘటన నుంచి తేరుకోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. మరో హిందువు బంగ్లాదేశ్లో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి ఓ హిందూ యువకుడిపై కొంతమంది దాడి చేసి చంపేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్గంజ్-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీలో చేయనున్నారు. గోవిందా చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాను గత ఏడాది గద్దె దించడానికి కారణానికి విద్యార్థి ఉద్యమం నుంచి ఏర్పడిన సంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మాంచోకు ప్రతినిధిగా షరీఫ్ ఒస్మాన్ హాదీ ఉన్నారు. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై ఢాకాలో కాల్పులు జరిగాయి.
బంగ్లాదేశ్ సమాజంలో హింసకు తావులేని, దీపూదాస్ హత్యా ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మీడియాతో మాట్లాడుతూ అబ్రార్ తెలిపారు. ఆరోపణలు, వదంతులు, భిన్నమైన విశ్వాసాలు హింసకు కారణం కారాదని అన్నారు.
దీపూదాస్పై తప్పుడు అభియోగాలు మోపారని, మహమ్మద్ ప్రవక్తను అవమానించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని షేక్ హసీనా ఒక ఆడియా ప్రకటనలో షేక్ హసీనా పేర్కొన్నారు.
ఢాకాలో జరిగిన ఘటనను నిరసిస్తూ ప్రదర్శకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీహెచ్పీతో పాటు పలు హిందూ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.
హాదీ హంతకులు భారత్కు పారిపోయారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు హింసాకాండకు దిగారు. అయితే హాదీ హంతకుల గురించి సరైన ఆచూకీ లేదని బంగ్లా పోలీసులు చెబుతున్నారు.