Share News

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు పాకిస్థాన్ ఘోర అవమానం

ABN , Publish Date - Feb 11 , 2026 | 09:50 PM

టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్‌లో ఆడనంటూ బెట్టు చేసి.. చివరకు టోర్నీ నుంచే వైదొలిగింది. ఈ క్రమంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చిన పాకిస్థాన్.. తాజాగా బంగ్లా ప్లేయర్‌ను ఘోరంగా అవమానించింది.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు పాకిస్థాన్ ఘోర అవమానం
PSL 2026 auction

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(Wordl Cup 2026) ప్రారంభానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్ లో ఆడనంటూ బెట్టు చేసి.. చివరకు టోర్నీ నుంచే వైదొలిగింది. ఈ వివాదం ప్రారంభం నుంచి బంగ్లాదేశ్‌ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్‌ ఇచ్చిన పాక్‌ మాత్రం ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే బంగ్లా ఆటగాళ్లను పాకిస్థాన్ ఘోరంగా అవమానించింది.


పొట్టి ప్రపంచ కప్ విషయంలో బాగా దెబ్బతిన్న బంగ్లాదేశ్‌(Bangladesh) ఆటగాళ్లు పాక్‌లో జరిగే పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌(పీఎస్ఎల్) వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ 2026 వేలంలో పాల్గొన్నారు. అయితే వరల్డ్ కప్ వివాదంలో బంగ్లా విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్‌.. పీఎస్‌ఎల్‌ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.


ఆ ఇద్దరికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఇక్కడ ఇంకా దారుణం ఏమిటంటే.. బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ను, ఆ దేశ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్‌లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మిగిలిన ఆటగాళ్లవైపు అయితే కన్నెత్తి కూడా చూడలేదు. బంగ్లాతో స్నేహం ఒలకబోసిన పాకిస్థాన్(Pakistan).. ఆదేశ​ ఆటగాళ్లను ఎంత ఘోర అవమానించిందో యూనస్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్లేయర్లు అర్దం కావాలి. ఇకనైనా పాక్‌ కపట నాటకాలకు బంగ్లాదేశ్ పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Updated Date - Feb 11 , 2026 | 09:57 PM