ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి: SEC
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:03 PM
సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటు చేసుకున్న ఉద్రికత్త కొత్త టర్న్ తీసుకుంది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశాలిచ్చింది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఎన్నికల సంఘం(SEC) సీరియస్ అయ్యింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశాలిచ్చింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ SEC అభిప్రాయపడింది.
ఎన్నికల కమిషన్ చర్యలపై జగ్గారెడ్డి స్పందన
ఎన్నికల కమిషన్ చర్యలపై జగ్గారెడ్డి స్పందించారు. BRS దొంగ ఓట్లపైనే ప్రశ్నించానని ఆయన వివరణ ఇచ్చారు. 'ఒక వార్డులో 300కి పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను.. సీఐ శివకుమార్ పట్టుకున్నారు. సీఐ శివకుమార్ వైఖరి వల్లే గొడవ జరిగింది. గొడవ జరగడానికి ఈసీ, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. దొంగ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించలేదు' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు, దొంగ ఓట్లు తొలగించకుండా.. ప్రశ్నించిన మాపైనే కేసులా?.. దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ విఫలం అయ్యిందంటూ జగ్గారెడ్డి ఆక్షేపించారు.
బీఆర్ఎస్ రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారు.. జగ్గారెడ్డి ఫైర్
కాగా, సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న సీఐ శివకుమార్ తీరుపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ.. 34 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారని.. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని జగ్గారెడ్డి ఫైరయ్యారు. సీఐ శివకుమార్.. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారని కూడా జగ్గారెడ్డి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News