కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:55 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై(Phone Tapping) రేవంత్ రెడ్డివి ఊకదంపుడు ప్రసంగాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రేవంత్ భయపడుతున్నారా? కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా? అని మంత్రి ప్రశ్నించారు.
అంతేకాకుండా.. రేవంత్ రెడ్డికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. యూరియా పక్కదారి పడుతున్నా ఏమీపట్టడం లేదా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు బ్లాక్‌లో యూరియా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని విమర్శించడం తప్ప.. రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. టీవీల ముందు తప్ప.. రైతుల పట్ల బాధ్యత లేదా అని, యూరియా మీద కనీసం సమీక్ష చేయరా అని నిలదీశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలో రైతులు గోసపడారని మంత్రి అన్నారు.
కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్యే సతీమణి డిజైనర్ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News