మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్ సర్వే
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:40 PM
తెలంగాణలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుందని చెప్పింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో ఇవాళ(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివెళ్లారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిపోగా.. బూత్ లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. అయితే, ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏ పార్టీకి ఏ స్థానం?
మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు
కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కింగ్ మేకర్ కానున్న ఎంఐఎం
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు
రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం.
నిజామాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
మొత్తంగా 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తన సర్వే ఫలితాల్లో పేర్కొంది.
8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా.. నేనా?’ అన్నట్టు పోటీ- పీపుల్స్ పల్స్
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
కాంగ్రెస్ జైత్రయాత్ర:
దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని సదరు సర్వే పేర్కొంది. ముఖ్యంగా మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయనుందని సర్వే అంచనా వేసింది.
బీజేపీకి రెండు కార్పొరేషన్లు - బీఆర్ఎస్ ఖేల్ ఖతం.?
బీజేపీ జోరు: ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును నిరూపించుకోనుందని సర్వే చెప్పింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, వాటిని కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంది.
బీఆర్ఎస్ పరిస్థితి: ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తీసేలా ఉన్నాయని తెలిపింది.. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా గెలుచుకునే అవకాశం ఆ పార్టీకి లేదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
కింగ్ మేకర్ ఎంఐఎం: నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో అధికార పీఠాన్ని నిర్ణయించడంలో ఎంఐఎం కీలక పాత్ర (కింగ్ మేకర్) పోషించనుందని సర్వే వెల్లడించింది.

ఓట్ల శాతం, మున్సిపాలిటీల లెక్క:
ఓట్ల శాతం: 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 29.7%, బీజేపీ 19.3% ఓట్లను సాధించవచ్చని సర్వే పేర్కొంది.
మొత్తం వార్డులు: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ 1210-1290 వార్డులను, బీఆర్ఎస్ 860-930 వార్డులను, బీజేపీ 250-270 వార్డులను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.
మొత్తంగా చూస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత పటిష్టం చేసుకోగా, బీఆర్ఎస్, బీజేపీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయనే విధంగా సర్వే ఫలితాలు వెలువరించింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే.

ప్రధాన కార్పొరేషన్లలో అంచనాలు (వార్డుల వారీగా):
కార్పొరేషన్ | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | ఇతర/ఎంఐఎం |
రామగుండం | 30-34 | 16-20 | 3-6 | 4-7 |
మంచిర్యాల | 39-43 | 8-12 | 6-9 | 1-2 |
నిజామాబాద్ | 10-16 | 2-4 | 26-31 | 8-12 (MIM) |
కరీంనగర్ | 14-16 | 10-12 | 24-29 | 6-9 (MIM) |
కొత్తగూడెం | 28-34 | 7-9 | - | 14-16 (CPI) |
