Share News

టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

ABN , Publish Date - Feb 11 , 2026 | 08:18 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో కంగారు జట్టు ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్2026: ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
Australia vs Ireland

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌(Worl Cup 2026) ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత ఇవాళ(బుధవారం) ఆస్ట్రేలియా మైదానంలోకి దిగింది. ఈ మెగా టోర్నీలో ఆసీస్ బోణీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో కంగారు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ (29 బంతుల్లో 45 పరుగులు), జోష్‌ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37 పరుగులు), రెన్ షా (33 బంతుల్లో 37 పరుగులు) రాణించారు. వన్‌డౌన్ బ్యాటింగ్ దిగిన కామెరూన్ గ్రీన్(11 బంతుల్లో 21 పరుగులు) దూకుడుగా ఆడాడు. అయితే గ్రీన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మార్క్ అడైర్ బౌలింగ్ లో గ్రీన్ పెవిలియన్ చేరాడు.


ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్ (6), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (9) విఫలమయ్యారు. కూపర్ కొన్నోలీ (11నాటౌట్), బార్ట్‌లెట్ (11నాటౌట్) పరుగులు చేశారు. ఐర్లాండ్(Ireland) బౌలర్లలో మార్క్ అడైర్ 2 సాధించాడు. అలానే మాథ్యూ హంఫ్రీస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లోర్కాన్ టక్కర్ (24), రాస్ అడైర్ 12, మార్క్ అడైర్ 12 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 4, ఆడమ్ జంపా 4, కునెమన్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

టీ20 ప్రపంచ కప్2026: నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో గెలిచిన సౌతాఫ్రికా

Updated Date - Feb 11 , 2026 | 08:27 PM