Share News

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:48 PM

శ్రీలంక క్రికెటర్‌ భనుక రాజపక్స ఇటీవల భారత బ్యాటర్ల గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. ఇదే సమయంలో అతడి కామెంట్స్‌ను పాక్ అభిమానులూ వక్రీకరించారు. దీంతో తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు భనుక రాజపక్స.

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!
Bhanuka Rajapaksa

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెటర్లపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. వాటికి పాకిస్థాన్ ఆటగాళ్లు, అక్కడి అభిమానులు మద్దతు ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేక కొందరు తెగ రచ్చ చేసేస్తుంటారు. అలాంటి ఆలోచన విధానం ఉండే పాక్ అభిమానులకు శ్రీలంక క్రికెటర్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. మరి ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..


శ్రీలంక క్రికెటర్‌ భనుక రాజపక్స ఇటీవల ఇండియన్ బ్యాటర్ల గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు వాడే బ్యాట్లు మిగతా దేశాల వారికంటే ఎంతో గొప్పగా ఉంటాయన్నాడు. భారత ఆటగాళ్ల బ్యాట్లపై అదనంగా ఓ రబ్బరు పొర కూడా ఉంటుందని అతను పేర్కొన్నాడు. అయితే భారత్ అంటే ఒంటికాలిపై లేచే పాక్.. రాజపక్స వ్యాఖ్యాలను వక్రీకించారు. భారత బ్యాటర్ల ఆటను కించపరిచేలా పోస్టులు పెట్టారు. ఇండియన్ బ్యాట్లలో తేడా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.


భనుక రాజపక్స అసలు ఉద్దేశం ఇదే..

పాక్ అభిమానులకు షాకిస్తూ.. రాజపక్స తన వ్యాఖ్యలకు ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. తన మాటల్ని వక్రీకరించి ఇష్టారీతిన ప్రచారం చేయడం సరికాదని వార్నింగ్ ఇచ్చాడు. ‘అందరికీ నమష్కారాలు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. వారికి తోచిన విధంగా ఊహించుకుని ప్రచారం చేస్తున్నారు. బహుశా నా మాటలను అనువాదం చేసుకోవడంలో వారు పొరపడి ఉంటారు' అని స్పష్టం చేశాడీ శ్రీలంక క్రికెటర్.


'నేను భారత బ్యాటర్లను ప్రశంసించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇండియన్ క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. వారి వద్ద అధునాతన వస్తువులు, మౌలిక సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్‌ పరికరాలు ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ల కోసం బ్యాట్లు తయారుచేసే​ వ్యక్తులు ప్రపంచంలోనే అత్యుత్తమైన వారు. నాకు భారత ఆటగాళ్ల పట్ల గౌరవం తప్ప ఇంకేమీ లేదు’ అని చెప్పాడు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన వారికి శ్రీలంక క్రికెటర్ చక్కటి కౌంటర్‌ ఇచ్చాడని నెటిజన్లు స్పందిస్తున్నారు. భనుక రాజపక్స తన కెరీర్‌లో 5 వన్డేలు, 45 టీ20 మ్యాచ్‌లాడాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 03:15 PM