ఓపెనర్లే బాదేశారు
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:39 AM
టీ20 వరల్డ్‌క్‌పలో ప్రధాన జట్లు పసికూనలపైనే తడబడుతున్నా.. న్యూజిలాండ్ మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరుతో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ను చిత్తు చేసిన మాదిరే.. తాజాగా...
నేటి మ్యాచ్‌లు
దక్షిణాఫ్రికా X అఫ్ఘానిస్థాన్
(ఉ. 11 గం. నుంచి)
ఆస్ట్రేలియా X ఐర్లాండ్ (మ.3 గం.)
ఇంగ్లండ్ X వెస్టిండీస్ (రా.7 గం.)
సైఫర్ట్, ఆలెన్‌ల మెరుపు ఇన్నింగ్స్
యూఏఈపై కివీస్ ఘనవిజయం
చెన్నై: టీ20 వరల్డ్‌క్‌పలో ప్రధాన జట్లు పసికూనలపైనే తడబడుతున్నా.. న్యూజిలాండ్ మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరుతో అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ను చిత్తు చేసిన మాదిరే.. తాజాగా మంగళవారం యూఏఈని మరింతగా వణికించి పది వికెట్ల తేడాతో నెగ్గింది. ప్రస్తుతం కివీస్ రెండు విజయాలతో గ్రూప్ ‘డి’లో నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 173/6 స్కోరు సాధించింది. ఓపెనర్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), షరాఫు (55) అర్ధసెంచరీలతో రాణించారు. హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఓపెనర్లు టిమ్ సైఫర్ట్ (42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 నాటౌట్), ఫిన్ ఆలెన్ (50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. దీంతో కేవలం 15.2 ఓవర్లలో కివీస్ 175 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించింది. సైఫర్ట్ 23 బంతుల్లో, ఆలెన్ 27 బంతుల్లో అజేయ అర్ధసెంచరీలు పూర్తి చేశారు. అలాగే పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని (175) నమోదు చేసిన జోడీగా నిలిచారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సైఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
యూఏఈ: 20 ఓవర్లలో 173/6 (వసీం 66 నాటౌట్, షరాఫు 55; హెన్రీ 2/37).
న్యూజిలాండ్: 15.4 ఓవర్లలో 175/0 (సైఫర్ట్ 89 నాటౌట్, ఆలెన్ 84 నాటౌట్).
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!