ఆకృతికి రజతం.. అంజుమ్‌కు కాంస్యం
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:28 AM
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన సీనియర్ మహిళల...
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో ఆకృతి దహియా రజతం, అంజుమ్ మోద్గిల్ కాంస్యం నెగ్గి పోడియం ఫినిష్ చేశారు. కజకిస్థాన్ షూటర్ షుల్జెన్‌కో (358.2) వరల్డ్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించింది. ఇక, జూనియర్ మహిళల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో భారత్‌కు చెందిన ప్రచీ గైక్వాడ్ స్వర్ణం, అనుష్క ఠాకూర్ కాంస్యం గెలిచారు.
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!