Share News

మరోసారి భారత్‌పై యూనస్ అక్కసు.. చివరి ప్రసంగంలో సెవెన్ సిస్టర్స్ ప్రస్తావన..

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:21 PM

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన మహమ్మద్ యూనస్ చివరి ప్రసంగంలో కూడా భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్‌పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

మరోసారి భారత్‌పై యూనస్ అక్కసు.. చివరి ప్రసంగంలో సెవెన్ సిస్టర్స్ ప్రస్తావన..
Yunus farewell speech

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన మహమ్మద్ యూనస్ తన చివరి ప్రసంగంలో కూడా భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్‌పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో యూనస్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ప్రజలనుద్దేశించి చేసిన చివరి ప్రసంగంలో యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాల గురించి కవ్వింపుగా మాట్లాడారు (Yunus farewell speech).


భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ గురించి మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపుర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, త్రిపురను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు. వాటి గురించి యూనస్ తాజాగా మాట్లాడారు. 'విశాల సముద్రం బంగ్లాదేశ్‌కు కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి ఉన్న ఏకైక మార్గం. నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉంది' అని యూనస్ పేర్కొన్నారు (Seven Sisters comment).


గతంలో చైనా పర్యటన సందర్భంగా కూడా యూనస్ మన దేశ ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడారు (India Bangladesh tension). ఆయా రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని, చైనా తన ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశం అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చైనాలో యూనస్ చేసిన వ్యాఖ్యలను భారత్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..


లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

Updated Date - Feb 17 , 2026 | 06:38 PM