భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:17 PM
జగపతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త అయిన జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. అయితే ఈ డీల్ పెద్దల సమక్షంలోనే జరగడం విశేషం.
జగపతిబాబు హీరోగా నటించిన 'శుభలగ్నం' సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త అయిన జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. అయితే ఈ డీల్ పెద్దల సమక్షంలోనే జరగడం విశేషం. భోపాల్‌కు చెందిన ఓ 43 ఏళ్ల వ్యక్తికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 14, 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతడికి ఆఫీస్‌లో ఒక 53 ఏళ్ల వయసున్న స్త్రీతో పరిచయం పెరిగింది (Wife sells husband).
తన కంటే పదేళ్లు పెద్దదైన మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎక్కువగా ఆమెతోనే ఉంటూ భార్యను, పిల్లలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. భార్య నిలదీయడంతో గొడవలు మొదలయ్యాయి. కుటుంబంలో కలహాలు రావడంతో ఆ దంపతులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ దంపతులను, అతడి ప్రియురాలిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించింది (shocking incident).
ఆ వ్యక్తి తన భార్యతో కాకుండా ప్రియురాలతోనే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు కోర్టులో దాదాపు ఐదేళ్ల పాటు సాగింది. తన భర్తకు తనతో ఉండడం ఇష్టం లేదని ఓ నిర్ణయానికి వచ్చిన మహిళ అతడిని వదిలేయడానికి నిర్ణయించుకుంది (husband sold story). అయితే కోర్టు సమక్షంలోనే తన సంచలన నిర్ణయాన్ని బయటపెట్టింది.
తన భర్తను ప్రియురాలు స్వీకరించాలనుకుంటే, అందుకు ప్రతిఫలంగా తనకు కోటి 60 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ప్రియురాలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పింది. తక్షణమే ఒక పెద్ద విల్లాను, అదనంగా 26 లక్షల రూపాయల నగదును తన ప్రియుడి భార్యకు అప్పగించింది. అలాగే భర్త నుంచి భార్యకు రావాల్సిన భరణంతో పాటు ఆస్తులు కూతుళ్లకు చెందేలా రాతకోతలు పూర్తయ్యాయి.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం