Home » Madhya Pradesh
ఇండోర్లో నీటి కాలుష్యానికి ఏకంగా 10 మంది బలి కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంచి నీటి పైప్లైన్లోకి మురుగు నీరు చేరడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే పైప్లైన్ను రిపేర్ చేశామని, కొన్ని రోజులు పాటు నల్లా నీటిని తాగొద్దని స్థానికులకు సూచించారు.
మధ్యప్రదేశ్ ఛత్తార్పూర్లో ఓ యువకుడు తన దగ్గరకు వచ్చిన నాగు పాముతో ఎలాంటి భయం లేకుండా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చలి మంట దగ్గర ఆగిన పాముతో ‘కాటు వేయకు’ అంటూ సంభాషించిన ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీటి వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్పురలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. తాజాగా ఆ నీటిని పాలలో కలిపి ఇవ్వడంతో ఐదు నెలల బాలుడు మరణించాడు.
భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండోర్లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు.
మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిపై దాడిచేసి.. ఆ తర్వాత మంచంపై కూర్చుంది.
బీజేపీ కౌన్సిలర్ భర్త తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రెండో పెళ్లి చేసుకోవటతానికి సిద్ధమైన ఓ వ్యక్తితో అతడి మొదటి భార్య, పిల్లలు దాడి చేశారు. కోర్టులోని అతడిని అతడికి కాబోయే రెండో భార్యని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.
ఓ వృద్ధుడి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా ముగిసిపోయింది. ఇంటి బయట సేద తీరుతున్న అతడిని కంకర ట్రక్ రూపంలో మృత్యువు కబళించింది. కంకర ట్రక్ మీదపడ్డంతో వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.
సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.