Share News

దారుణం.. మంత్రాల నెపంతో పొరుగింటి వారిని చంపిన వ్యక్తి

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:21 PM

తాను తండ్రి కాకుండా ఉండేందుకు క్షుద్ర పూజలు చేశారనే అనుమానంతో పొరుగింట్లో నివాసం ఉండే దంపతులను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో చోటుచేసుకుంది.

దారుణం.. మంత్రాల నెపంతో పొరుగింటి వారిని చంపిన వ్యక్తి
Madhya Pradesh Crime

సింగ్రౌలి, ఫిబ్రవరి 12: తన భార్యకు గర్భ స్రావమైందని, పొరుగింటి వారు మంత్ర విద్యలు చేశారనే అనుమానంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సింగ్రౌలి జిల్లా అంతర్యాలో ఛత్రపతి సింగ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటీవలే అతడి భార్యకు గర్భ స్రావమైంది. పొరుగింటి దంపతులు మంత్ర విద్యల కారణంగానే తాను తండ్రిని కాలేకపోయానని ఛత్రపతి భావించాడు. ఎలాగైనా వారిని చంపాలని పథకం రచించాడు. ఈ క్రమంలో గురువారం ఛత్రపతి సింగ్.. తన ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నానని పొరుగింటి కేవల్ సింగ్, అతడి భార్య ఫుల్మతిని ఆహ్వానించాడు.


వీరితోపాటు మరికొంతమందిని తన ఇంట్లో నిర్వహించే పూజలకు ఆహ్వానించాడు. తన భార్యతో కలిసి కేవల్ సింగ్ అక్కడికి చేరుకోగానే.. వారిపై ఛత్రపతి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కొందరు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. వారిపైనా దాడి చేశాడు. అనంతరం గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. ఈ దాడిలో కేవల్ సింగ్, అతడి భార్య మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గదిలో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలానే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను తండ్రిని కాకుండా.. కేవల్ సింగ్ దంపతులు క్షుద్ర పూజలు (black magic suspicion) చేశారని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు.


ఈ వార్తలూ చదవండి:

మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మిస్టరీ

ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం

Updated Date - Feb 12 , 2026 | 07:59 PM