విశ్వాసానికి నిలువెత్తు రూపం.. యజమాని చనిపోయినా..
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:01 PM
చనిపోయిన తన యజమానిపై ఓ కుక్క ఎనలేని ప్రేమను చూపించింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శవం దగ్గరే ఉంది. కొంచెం కూడా పక్కకు కదల్లేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: శునకాలు విశ్వాసానికి మారుపేరని అందరికీ తెలిసిన సంగతే. శునకాలకు కొంచెం తిండి పెడితే చాలు.. అవి ఎంతో నిజాయతీగా మనకు సేవ చేస్తాయి. మన కోసం ప్రాణాలు కూడా ఇస్తాయి. తమ యజమానికి ఏమైనా జరిగితే అవి తల్లడిల్లిపోతాయి. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. చనిపోయిన తన యజమానిపై ఓ కుక్క ఎనలేని ప్రేమను చూపించింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శవం దగ్గరే ఉంది. కొంచెం కూడా పక్కకు కదల్లేదు. ఒక రోజంతా నీళ్లు తాగలేదు.. తిండితినలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శివ్‌పురిలోని బడోరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుక్కను పెంచుకునేవాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే.. ఆ వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. ఆరాత్రి మొత్తం ఆ కుక్క అతడి శవం దగ్గరే కూర్చుంది. కొంచెం కూడా పక్కకు కదల్లేదు. మరుసటి రోజు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవాన్ని వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ కుక్క నాలుగు కిలోమీటర్లు వాహనం వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లింది.
ఆస్పత్రి దగ్గరకు వెళ్లిన తర్వాత మార్చురీ దగ్గర కూర్చుంది. కొంచెం కూడా పక్కకు కదలకుండా అలాగే ఉండిపోయింది. పోస్టుమార్టం పూర్తయ్యే వరకు మంచి నీళ్లు కూడా తాగలేదు. తిండిపెట్టినా తినలేదు. పోస్టుమార్టం తర్వాత శవాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. అక్కడికీ వెళ్లిందా శునకం. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉంది. కొంచెం కూడా పక్కకు కదల్లేదు. తన యజమాని శవం పక్కనే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. కుక్క విశ్వాసంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో డారిల్ మిచెల్
టీడీపీ నేత బంగారయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వైసీపీ నేతల అరెస్ట్