Share News

ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి, పలువురికి గాయాలు

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:45 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుని 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి, పలువురికి గాయాలు
temple stampede

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుని 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఒక మైనర్ బాలిక ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స కొసం గ్వాలియర్‌కు తరలించగా, మరో ముగ్గురికి దాబ్రాలో చికిత్స అందిస్తున్నారు.


కలశ యాత్రలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం దాబ్రా స్టేడియం వద్దకు పెద్దఎత్తున మహిళలు చేరుకున్నారని, కలశాల పంపిణీ జరుగుతుండగా తోపులాట చోటుచేసుకుందని గ్వాలియర్ కలెక్టర్ రుచిక చౌహాన్ తెలిపారు. ఈ ఘటనలో 70 ఏళ్ల మహిళ మృతిచెందినట్టు చెప్పారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చామని, కలశ యాత్ర ముందుగు సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. పెద్దఎత్తున మహిళలు తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కలశయాత్ర ముందుగా నిర్దేశించిన మార్గాల్లో బయలుదేరి నవగ్రహ ఆలాయనికి చేరుకున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది.


ఇవి కూడా చదవండి..

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 10 , 2026 | 04:24 PM