Home » International News
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో ఐదేళ్లకు పైగా కలిసి ఉన్న శివోన్ జిలిస్ తమ బంధం ముగిసినట్లు ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఫ్లైదుబాయ్ విమానం కూలిపోయుంటే తప్పుడు సంకేతం వెళ్లేదని, భారత పైలట్లకు చెడ్డపేరు రాకుండా స్మిత్ మచ్చార్ కాపాడారని ఆయన మామ (మచ్చార్ భార్య తండ్రి) జైసుఖ్ జోగి అన్నారు.
భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హల్ హమామీ పేరుతో లింక్డ్‌ఇన్‌లో ఉన్న ప్రొఫైల్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అతని పేరుతో ఉన్న ఫ్రొఫైల్‌లో టెర్రరిస్టుల ఫొటో ఉన్నట్లు ఓ వార్తా సంస్థ కథనం వెలువరించింది. అయితే, మచ్చార్‌పై దాడి జరిగిన 9 గంటల తర్వాత హమామీ ప్రొఫైల్ డిలీట్ అయిందని ఆ కథనం తెలిపింది.
కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మచ్చార్ ధైర్యసాహసాలను తాజాగా ఆయన మాజీ కొలీగ్ టీనా గోస్వామి కొనియాడారు. పైలట్ శిక్షణలో నేర్చుకున్నదానిని కెప్టెన్ స్మిత్ మచార్ ఆచరించి చూపారని తెలిపారు. శనివారం ఓ టీవీ చానెల్‌తో టీనా మాట్లాడారు.
భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన ఘటనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏఐతో రూపొందించిన పాటలను ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో 981 రష్యా అనుకూల యుద్ధ ప్రచార పాటలు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.
స్విట్జర్లాండ్.. ఈ పేరు చెప్పగానే తెల్లటి, చల్లటి మంచుతో కూడిన సుందరమైన ఆల్ప్స్ పర్వతాలు గుర్తొస్తాయి! ఆ మంచుకొండల్లో తెలుగు సినిమా హీరో, హీరోయిన్లు వేసిన స్టెప్పులు కూడా గుర్తొస్తాయి!!
అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ జీ7 కూటమి చల్లని కబురు చెప్పింది. ఈ కూటమిలోని దేశాలన్నీ కలిసి త్వరలోనే 10కోట్ల బ్యారెళ్ల చమురును..
అమెరికా అంతరిక్ష చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని నమోదు చేస్తూ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి చేరుకున్నారు.