Share News

టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు..

ABN , Publish Date - Feb 19 , 2026 | 10:43 AM

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హనుమాన్ విగ్రహంపై ‘మాగా’ మద్దతుదారుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ విగ్రహం అమెరికాపై భారతీయ వలసదారుల దాడికి గుర్తని అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ పై తీవ్ర దుమారం రేగుతోంది.

టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు..
Hanuman Statue Texas Controversy

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America)లోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సమీపంలోని షుగర్ ల్యాండ్ పట్టణంలో ప్రతిష్టించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహం (Statue of Union)పై కార్లోస్ టూర్సియోస్ (Carlos Turcios) అనే మాగా (MAGA) కార్యకర్త చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. టెక్సాస్ లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతుదారుడైన కార్లోస్.. శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.


కార్లోస్ చేసిన పోస్ట్‌లో.. ‘ఇది భారత్‌లోని ఢిల్లీ కాదు.. ఇది టెక్సాస్. మూడో ప్రపంచ దేశాల వారు నెమ్మదిగా టెక్సాస్, అమెరికాను ఆక్రమిస్తున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహం ఇక్కడ ఎందుకు ఉండాలి?. ఈ ఆక్రమణను ఆపండి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు. కార్లోస్ చేసిన వ్యాఖ్యలపై ఆలయ కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఈ విగ్రహం పూర్తిగా ప్రైవేట్ స్థలంలో భక్తుల విరాళాలు సేకరించి దీన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్లోస్ వ్యాఖ్యలపై అమెరికాలోనే కాదు.. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే విగ్రహంపై రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది అసలు నిజమైన దేవుడి విగ్రహం కాదని, ఇలాంటి హిందూ విగ్రహాలను ఇక్కడ ఎలా అనుమతిస్తారు? అని ప్రశ్నించారు. డంకన్ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి.


ఇవి కూడా చదవండి

ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..

టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్

Updated Date - Feb 19 , 2026 | 11:52 AM