ప్రమాదకర కత్తులు అమ్మిన బ్లింకిట్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:49 PM
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మిందనే కారణంతో ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. బ్లింకిట్ స్టోర్స్‌లో ఉన్న 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మిందనే కారణంతో ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. బ్లింకిట్ స్టోర్స్‌లో ఉన్న 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు హత్యల్లో ఉపయోగించిన కత్తులను నిందితులు బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసినట్టు తేలింది. దీంతో ఢిల్లీ పోలీసులు బ్లింకిట్‌పై కేసు నమోదు చేశారు (BlinkIt news).
బ్లింకిట్ సంస్థ నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులను ఇంటికి డెలివరీ చేస్తుందనే సంగతి తెలిసిందే. సాధారణంగా ఆన్‌లైన్ వేదికగా ఏ వస్తువు అమ్మాలన్నా అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న కత్తుల్ని మాత్రమే ఆన్‌లైన్‌లో అమ్మాలి. ఒకవేళ అంతకంటే పెద్ద కత్తులను అమ్మితే ఆయుధాల చట్టం ప్రకారం చట్టరీత్యా నేరం. అయితే, బ్లింకిట్ తాజాగా అమ్మిన బటన్ కత్తి 8 సెంటీమీటర్ల పొడవు, 2.5 సెం.మీ. వెడల్పుతో ఉంది (Button knife controversy).
ప్రభుత్వం అనుమతించిన దాని కంటే బ్లింకిట్ విక్రయించిన ఈ కత్తులు పెద్దవిగా ఉన్నాయి (e-commerce weapons sale). అందుకే బ్లింకిట్‌పై పోలీసులు చర్యలకు దిగారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితులు తాము కత్తుల్ని బ్లింకిట్‌లో ఆర్డర్ చేసినట్లుగా చెప్పారు. దీంతో పోలీసులు బ్లింకిట్ నుంచి రెండు కత్తుల్ని ఆర్డర్ చేశారు. ఒక్కో కత్తి ధర రూ.699. వాటిని అందుకున్న ఢిల్లీ పోలీసులు బ్లింకిట్‌పై కేసు నమోదు చేశారు. బ్లింకిట్ స్టోర్లపై దాడి చేసి 55 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇమ్రాన్ హత్యకు కుట్ర.. మమ్మల్ని మొహ్సిన్ బెదిరిస్తున్నారు.. మాజీ ప్రధాని సోదరీమణుల ఆరోపణలు..
మీ దృష్టికి పరీక్ష.. ఈ పార్క్‌లో ఉన్న పక్షిని 27 సెకెన్లలో గుర్తించండి..