Share News

టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Feb 18 , 2026 | 06:34 PM

టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్: భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. లైవ్ అప్‌డేట్స్
T20 World Cup

Live News & Updates

  • Feb 18, 2026 22:39 IST

    నెదర్లాండ్స్‌పై టీమిండియా విజయం

    • అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం

    • 17 పరుగుల తేడాతో పోరాడి ఓడిన నెదర్లాండ్స్

    • బాస్ డీ లీడె(33) టాప్ స్కోరర్

    • వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు

    • శివం దూబెకి 2, బుమ్రా, పాండ్యలకు తలొక వికెట్

    • వరుసగా నాలుగో విజయం నమోదు చేసిన టీమిండియా

  • Feb 18, 2026 22:35 IST

    నెదర్లాండ్స్ ఏడో వికెట్ డౌన్

    • దూబే వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతికి సుందర్‌కి క్యాచ్ ఇచ్చిన లయన్(26)

  • Feb 18, 2026 22:33 IST

    జోరు పెంచిన బ్యాటర్లు

    • హార్దిక్ వేసిన 19వ ఓవర్లో వచ్చిన పరుగులు 18

    • ఈ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన క్రోస్(26)

    • మరో బౌండరీ బాదిన లయన్(20)

    • 19 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోర్ 166/6

  • Feb 18, 2026 22:28 IST

    18 ఓవర్లు.. నెదర్లాండ్స్ స్కోర్ 148/6

    • అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 12

    • క్రీజులో క్రోస్(15), లయన్(13)

    • నెదర్లాండ్స్ విజయానికి 12 బంతుల్లో 46 పరుగులు అవసరం

  • Feb 18, 2026 22:22 IST

    రెండు ఫోర్లు బాదిన క్రోస్

    • వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • ఆఖరి రెండు బంతులను బౌండరీకి పంపిన క్రోస్(9)

    • మరో ఎండ్‌లో లయన్(7)

    • 17 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోర్ 136/6

  • Feb 18, 2026 22:17 IST

    బుమ్రాకు వికెట్.. నెదర్లాండ్స్ ఆరో వికెట్ డౌన్

    • బుమ్రా వేసిన 16వ ఓవర్ ఐదో బంతికి ఎడ్వర్డ్(15) క్లీన్ బౌల్డ్

    • 125 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్

    • క్రీజులోకి క్రోస్

  • Feb 18, 2026 22:15 IST

    15 ఓవర్లు పూర్తి.. నెదర్లాండ్స్ స్కోర్ 118/5

    • వాషింగ్టన్ సుందర్ వేసిన 15వ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • క్రీజులో ఎడ్వార్డ్స్(10), లయన్ కాషే(3)

    • నెదర్లాండ్స్ స్కోర్ 118/5

    • నెదర్లాండ్స్ విజయానికి 30 బంతుల్లో 76 పరుగులు అవసరం

  • Feb 18, 2026 22:08 IST

    ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్

    • దూబే వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చిన లీడె(33)

  • Feb 18, 2026 22:00 IST

    వరుణ్ మ్యాజిక్.. మరో వికెట్ డౌన్

    • 13వ ఓవర్ రెండో బంతికి ఆర్యన్ దత్(0) క్లీన్ బౌల్డ్

    • బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు సాధించిన వరుణ్ చక్రవర్తి

  • Feb 18, 2026 21:59 IST

    మూడో వికెట్ డౌన్.. అకెర్‌మ్యాన్(23) ఔట్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్ తొలి బంతికి రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చిన అకెర్‌మ్యాన్(23)

    • వరుణ్‌కు ఇది రెండో వికెట్

    • 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్

  • Feb 18, 2026 21:58 IST

    దూకుడు పెంచిన బ్యాటర్లు

    • దూబే వేసిన 12వ ఓవర్లో తలో బౌండరీ బాదిన అకెర్‌మ్యాన్(23), లీడ(22)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 12

    • నెదర్లాండ్స్ స్కోర్ 94/2

  • Feb 18, 2026 21:54 IST

    అకెర్‌మ్యాన్ భారీ సిక్సర్

    • 11వ ఓవర్ వేసిన అభిషేక్ శర్మ

    • ఈ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అకెర్‌మ్యాన్(17)

    • మొత్తం వచ్చిన పరుగులు 10

    • 11 ఓవర్లకు స్కోర్ 82/2

    • నెదర్లాండ్స్ విజయానికి 54 బంతుల్లో 112 పరుగులు అవసరం

  • Feb 18, 2026 21:50 IST

    10 ఓవర్లు పూర్తి.. నెదర్లాండ్స్ స్కోర్ 72/2

    • హార్దిక్ వేసిన ఈ ఓవర్లో ఓ సిక్సర్, బౌండరీ బాదిన లీడె(15)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 14

    • మరో ఎండ్‌లో అకెర్‌మ్యాన్(9)

  • Feb 18, 2026 21:39 IST

    నెదర్లాండ్స్ రెండో వికెట్ డౌన్.. లెవిట్(24) ఔట్

    • హార్దిక్ పాండ్య వేసిన 8వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ లైన్ వద్ద సుందర్‌కు చిక్కిన లెవిట్(24)

    • 51 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్

  • Feb 18, 2026 21:36 IST

    ఆచితూచి ఆడుతున్న నెదర్లాండ్స్ బ్యాటర్లు

    • వాషింగ్టన్ సుందర్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 8

    • రెండో బంతికి బౌండరీ బాదిన లెవిట్(19)

    • మరో ఎండ్‌లో డీ లీడె(2)

    • 7 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోర్ 44/1

  • Feb 18, 2026 21:29 IST

    తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్

    • వరుణ్ చక్రవర్తికి వికెట్

    • మ్యాక్స్ (20) అవుట్

    • 5.4 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 35/1

  • Feb 18, 2026 21:21 IST

    నిలకడగా ఆడుతున్న నెదర్లాండ్స్ బ్యాటర్లు

    • అర్ష్‌దీప్, బుమ్రా బౌలింగ్‌లో బౌండరీలు

    • 4 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 22/0

  • Feb 18, 2026 21:17 IST

    3 ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 17/0

    • అర్ష్‌దీప ఓవర్లో నాలుగు పరుగులు

  • Feb 18, 2026 21:12 IST

    రెండు ఓవర్లకు నెదర్లాండ్స్ స్కోరు 11/0

    • బుమ్రా ఓవర్లో ఐదు పరుగులు

  • Feb 18, 2026 21:07 IST

    ప్రారంభమైన నెదర్లాండ్స్ బ్యాటింగ్

    • నాలుగో బంతికి ఫోర్ కొట్టిన ఓపెనర్ లెవిట్

    • తొలి ఓవర్‌కు నెదర్లాండ్స్ స్కోరు 6/0

  • Feb 18, 2026 20:53 IST

    ఇన్నింగ్స్ పూర్తి.. నెదర్లాండ్స్ టార్గెట్ 194

    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన టీమిండియా

    • బౌలర్లపై విరుచుపడ్డ దూబే(66; 31 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్స్‌లు)

    • రాణించిన తిలక్ వర్మ(31), సూర్య(34), హార్దిక్(30)

    • మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ(0)

    • నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2, క్లీన్‌ 1 వికెట్లు

    • నెదర్లాండ్స్ విజయ లక్ష్యం 194 పరుగులు

  • Feb 18, 2026 20:50 IST

    ఒకే ఓవర్లో రెండు వికెట్లు

    • ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి మెర్వేకి క్యాచ్ ఇచ్చిన హార్దిక్(30)

  • Feb 18, 2026 20:47 IST

    ప్చ్.. దూబే(66) ఔట్

    • వాన్ బీక్ వేసిన ఆఖరి ఓవర్ రెండో బంతికి బౌండరీ లైన్ వద్ద టిమ్ వాన్‌కు క్యాచ్ ఇచ్చిన దూబే(66)

    • ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • Feb 18, 2026 20:43 IST

    పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు

    • క్లీన్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన హార్దిక్ పాండ్య(30)

    • ఓ బౌండరీ బాదిన దూబే(60)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 21

    • 19 ఓవర్లకు టీమిండియా స్కోర్ 180/4

  • Feb 18, 2026 20:34 IST

    దూబే ఆన్ ఫైర్

    • డీ లీడె వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాదిన దూబే(55)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • 18 ఓవర్లకు టీమిండియా స్కోర్ 159/4

  • Feb 18, 2026 20:30 IST

    దూబే హాఫ్ సెంచరీ

    • వాన్ బీక్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబే(50)

    • మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్య(15)

    • 150 పరుగులు దాటిన టీమిండియా స్కోర్

    • 17 ఓవర్లకు స్కోర్ 153/4

  • Feb 18, 2026 20:25 IST

    జోరు పెంచిన బ్యాటర్లు

    • వాండర్ మెర్వే వేసిన 16వ ఓవర్లో తలో సిక్సర్ బాదిన దూబే, హార్దిక్ పాండ్య

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 15

    • 16 ఓవర్లకు టీమిండియా స్కోర్ 133/4

  • Feb 18, 2026 20:20 IST

    15 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 118/4

    • డీ లీడె వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో దూబే(26), హార్దిక్(5)

  • Feb 18, 2026 20:10 IST

    నాలుగో వికెట్ డౌన్.. సూర్య(34) ఔట్

    • క్లీన్ వేసిన 14వ ఓవర్ మూడో బంతికి టిమ్ వాన్‌కు క్యాచ్ ఇచ్చిన సూర్య(34)

    • 110 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

    • క్రీజులోకి హార్దిక్ పాండ్య

  • Feb 18, 2026 20:08 IST

    దూబే దూకుడు

    • అకెర్‌మ్యాన్ వేసిన 13వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన దూబే(23)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 19

    • మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్(32)

    • 13 ఓవర్లకు టీమిండియా స్కోర్ 108/3

  • Feb 18, 2026 19:58 IST

    తడబడుతోన్న టీమిండియా బ్యాటర్లు

    • ఆర్యన్ దత్ వేసిన 11వ ఓవర్లో వచ్చిన పరుగులు కేవలం 2

    • క్రీజులో దూబే(3), సూర్య(23)

    • 11 ఓవర్లకు టీమిండియా స్కోర్ 76/3

  • Feb 18, 2026 19:52 IST

    10 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోర్ 74/3

    • క్లీన్ వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో దూబే(2), సూర్య(22)

    • 10 ఓవర్లకు టీమిండియా స్కోర్ 74/3

  • Feb 18, 2026 19:46 IST

    తిలక్ వర్మ(31) ఔట్

    • వాన్ బీక్ వేసిన ఆఖరి బంతికి రోలెఫ్‌ వాన్‌ డిర్ మెర్వ్‌కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ(31)

    • 9వ ఓవర్ నాలుగో బంతికి లెవిట్ క్యాచ్ డ్రాప్ చేయడంతో సూర్యకు లైఫ్

    • 9 ఓవర్లకు టీమిండియా స్కోర్ 69/3

  • Feb 18, 2026 19:42 IST

    నెమ్మదించిన స్కోర్ బోర్డు

    • డీ లీడె వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 4

    • కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తోన్న నెదర్లాండ్స్ బౌలర్లు

    • క్రీజులో తిలక్ వర్మ(29), సూర్య(13)

    • 8 ఓవర్లకు టీమిండియా స్కోర్ 60/2

  • Feb 18, 2026 19:37 IST

    నిలకడగా ఆడుతున్న టీమిండియా బ్యాటర్లు

    • అకెర్‌మ్యాన్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • క్రీజులో తిలక్ వర్మ(27), సూర్యకుమార్(11)

    • 7 ఓవర్లకు టీమిండియా స్కోర్ 56/2

  • Feb 18, 2026 19:32 IST

    పవర్ ప్లే పూర్తి.. టీమిండియా స్కోర్ 51/2

    • క్లీన్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 7

    • తొలి బంతికి బౌండరీ బాదిన సూర్యకుమార్ యాదవ్(7)

    • మరో ఎండ్‌లో తిలక్ వర్మ(26)

    • 50 పరుగులు దాటిన టీమిండియా స్కోర్

  • Feb 18, 2026 19:22 IST

    రెండో వికెట్ డౌన్.. ఇషాన్(18) ఔట్

    • ఆర్యన్ దత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(18) స్టంప్ ఔట్

    • బౌండరీ బాది పెవిలియన్ చేరిన ఇషాన్

    • ఆర్యన్ దత్‌కు రెండో వికెట్

    • క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్

  • Feb 18, 2026 19:19 IST

    బౌండరీల కోసం పోటీ పడుతున్న బ్యాటర్లు

    • అకెర్‌మ్యాన్ వేసిన నాలుగో ఓవర్లో ఓ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్(14)

    • ఆఖరి బంతిని బౌండరీకి పంపిన తిలక్ వర్మ(21)

    • 4 ఓవర్లకు టీమిండియా స్కోర్ 35/1

  • Feb 18, 2026 19:15 IST

    తిలక్ వర్మ బౌండరీ

    • ఆర్యన్ దత్ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • మూడో బంతికి బౌండరీ బాదిన తిలక్ వర్మ(16)

    • మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్(7)

    • 3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 23/1

  • Feb 18, 2026 19:12 IST

    జోరు పెంచిన బ్యాటర్లు

    • వాన్ బీక్ వేసిన రెండో ఓవర్లో వచ్చిన పరుగులు 15

    • ఈ ఓవర్‌లో తొలి బంతికే భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ(11)

    • మూడో బంతిని బౌండరీకి పంపిన ఇషాన్ కిషన్(7)

    • 2 ఓవర్లకు టీమిండియా స్కోర్ 18/1

  • Feb 18, 2026 19:06 IST

    కట్టుదిట్టమైన బౌలింగ్

    • ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్‌లో వచ్చిన పరుగులు 3

    • టీమిండియా స్కోర్ 3/1

  • Feb 18, 2026 19:03 IST

    టీమిండియాకు షాక్.. అభిషేక్ డకౌట్

    • మరోసారి విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ

    • పరుగుల ఖాతా తెరవకుండానే ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అభిషేక్ క్లీన్ బౌల్డ్

  • Feb 18, 2026 19:02 IST

    టీమిండియా బ్యాటింగ్ షురు

    • క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

    • తొలి ఓవర్ వేస్తోన్న నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్

  • Feb 18, 2026 18:44 IST

    నెదర్లాండ్స్ తుది జట్టు:

    • మైకెల్‌ లెవిట్, మాక్స్ ఓడౌడ్, బాస్‌ డి లీడె, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్వర్డ్స్‌ (వికెట్ కీపర్/కెప్టెన్), జాక్ లైయన్ కాచెట్, నోవ్ క్రోయిస్, రోలెఫ్‌ వాన్‌ డిర్ మెర్వ్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్‌ క్లీన్

  • Feb 18, 2026 18:38 IST

    భారత తుది జట్టు:

    • తుది జట్టులో రెండు మార్పులు

    • కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం

    • అక్షర్ పటేల్‌కు విశ్రాంతి

    • అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్

    • జట్టు ఇదే: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివం దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

  • Feb 18, 2026 18:34 IST

    టాస్ గెలిచిన భారత్

    • టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా తలపడనున్న భారత్-నెదర్లాండ్స్ జట్లు

    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న నెదర్లాండ్స్ జట్లు