Share News

యాంటీబయాటిక్స్‌ విఫలమవుతున్నాయా..!

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:01 AM

ఇటీవలి కాలంలో యాంటీబయాటిక్స్‌ వాడకం ఎక్కువైంది. ఇలా మితిమీరిన వాడకం వల్ల యాంటీబయాటిక్‌ నిరోధకత పెరిగి మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది....

యాంటీబయాటిక్స్‌ విఫలమవుతున్నాయా..!

  • ప్రతి ఐదుగురిలో ఒకరిలో కార్బాపెనెమ్స్‌ నిరోధకత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఇటీవలి కాలంలో యాంటీబయాటిక్స్‌ వాడకం ఎక్కువైంది. ఇలా మితిమీరిన వాడకం వల్ల యాంటీబయాటిక్‌ నిరోధకత పెరిగి మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఐసీఎంఆర్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో 20ు మందిలో ఇన్ఫెక్షన్లు అభివృద్ధి చెందుతున్నాయని, ఇలా ఇన్ఫెక్షన్లు సోకిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరిలో కార్బాపెనెమ్స్‌ ఔషధ నిరోధకత కనిపిచిందని గుర్తించారు. ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి చివరి ప్రయత్నంగా ఇచ్చే అత్యంత శక్తిమంతమైన ఔషధం ఇది. అలాంటి పవర్‌ఫుల్‌ యాంటీబయాటిక్‌ కూడా పనిచేయని పరిస్థితి ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన సుమారు 1.50 లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించగా.. ఈ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

Updated Date - Feb 19 , 2026 | 04:01 AM