Share News

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు

ABN , Publish Date - Feb 18 , 2026 | 07:03 AM

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదించబడింది. అయితే, ఈ ప్రతిపాదనను కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే..

శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం.. ఎంపీలకు పెన్షన్లు రద్దు
Sri Lanka Government Decision

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక సర్కార్(Sri Lanka Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్ల(Pensions)ను రద్దు చేస్తూ కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా ఎంపీలకు దశాబ్దాలుగా వస్తున్న ఒక ప్రత్యేక సౌకర్యానికి పూర్తిగా తెరపడింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ (Parliament)లో మంగళవారం ఆమోదం పొందింది. మొత్తం 225 మంది సభ్యులు ఉన్న సభలో 154 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. మిగిలిన సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.


శ్రీలంకలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన పార్లమెంట్ సభ్యుల(Members of Parliament)కు పెన్షన్ అందుతోంది. అయితే, కొత్త చట్టం ప్రకారం ఇప్పటి వరకు అందుకుంటున్న వారితోపాటు, కొత్తగా అర్హత సాధించిన వారికీ పెన్షన్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సా నాయకే నేతృత్వంలోని ప్రభుత్వం.. రాజకీయ నాయకులకు ఇచ్చే ఇంటి అద్దె, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అనవసరపు ప్రోత్సాహకాలు, విలాసాలను తగ్గించి ప్రజా ధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..

లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే.

Updated Date - Feb 18 , 2026 | 07:27 AM