డేటా సెంటర్లపై అదానీ గ్రూప్ 9 లక్షల కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:24 AM
ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ ఏఐ రంగంలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. పునరాత్పదక ఇంధనంతో నడిచే భారీ డేటా సెంటర్ల అభివృద్ధికి...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ ఏఐ రంగంలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. పునరాత్పదక ఇంధనంతో నడిచే భారీ డేటా సెంటర్ల అభివృద్ధికి 2035 నాటికి రూ.9 లక్షల కోట్లు (100 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని వెల్లడించింది. ఈ పెట్టుబడులతో దేశంలో సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, ఇతర అనుబంధ రంగాల్లో మరో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా రాబోయే దశాబ్దకాలంలో ఏఐ మౌలిక సదుపాయాల వ్యవస్థకు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. తద్వారా ఏఐ రంగంలో భారత్ నాయకత్వ స్థానంలో నిలవనుందని అదానీ అన్నారు. కాగా, అదానీకానెక్స్‌కు ఇప్పటికే 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఉంది. దీన్ని 5 గిగావాట్ల సామర్థ్యానికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గూగుల్‌తో కలిసి విశాఖపట్నం, నోయిడాల్లోనూ, మైక్రోసా్‌ఫ్టతో కలిసి హైదరాబాద్, పుణెల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ