Share News

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 08:05 PM

భారత్‌కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్‌ను ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. ఫాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌ (Emmanuel Macron)తో కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు.

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ
Emmanuel Macron with PM Modi

ముంబై: భారత్‌కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్‌ను ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. ఫాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌ (Emmanuel Macron)తో కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు. ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఇండియాలోనే తయారు చేస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని లోక్‌భవన్‌లో ఇరువురు నేతలు సమావేశ దైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమవేశంలో మాట్లాడారు.


H-125.jpg

ఎల్లలులేని బంధం

ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాయని, రెండుదేశాల మధ్య మైత్రీ సంబంధాలకు ఎల్లలు లేవని మోదీ అన్నారు. లోతైన సముద్రాల నుంచి ఎత్తైన ఎవరెస్ట్ వరకూ తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. రఫేల్ జెట్‌ల నుంచి ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హైలికాప్టర్లను ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లోనే తయారు చేయనున్నామని, ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామని చెప్పారు. ఇవాల్టి కల్లోలిత ప్రపంచంలో అంతర్జాతీయ సుస్థిరతను సాధించే భాగస్వామ్యం ఇదని అన్నారు. కొన్ని రోజులక్రితమే ఐరోపా కూటమితో చారిత్రక స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తుచేశారు.


విశ్వసనీయ భాగస్వామి

భారత్‌ను తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నారు. చట్టబద్ధ పాలనను ఇరుదేశాలు బలంగా విశ్వసిస్తాయని, ఆచరణలో చూపెడుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ సహకారం ఉంటుందన్నారు. ఇరుదేశాల రక్షణ సంబంధాలు రాఫెల్ జెట్ల నుంచి సబ్‌మెరైన్ల వరకూ విస్తరించినట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

Updated Date - Feb 17 , 2026 | 08:09 PM