కమల్ హాసన్ పార్టీకి టార్చిలైటు గుర్తు
ABN , Publish Date - Feb 17 , 2026 | 02:53 PM
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్ గుర్తును భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు కేటాయించింది. 2026 పుదుచ్చేరి ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసేందుకు ఈ గుర్తును కేటాయించినట్టు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
చెన్నై: కమల్ హాసన్ (Kamal Haasan) మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీకి టార్చిలైట్ (Battery Torch) గుర్తును భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు కేటాయించింది. 2026 పుదుచ్చేరి ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసేందుకు ఈ గుర్తును కేటాయించినట్టు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది.
కాగా, తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ టార్చిలైట్ గుర్తుతోనే ఎంఎన్ఎం పోటీ చేయనుంది. గత నెలలో ఎన్నికల సన్నాహకాలను ఎంఎన్ఎం ప్రారంభించింది. చెన్నైలో ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఎలక్షన్ వార్ రూమ్ ఏర్పాటు, వివిధ అంశాల్లో పార్టీ అనుసరించాల్సి వైఖరిపై తీర్మానాలను ఆమోదించింది. పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయాలనుకునే వారు శనివారం నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఎంఎన్ఎం ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలు ప్రకటించాయి. అభ్యర్థులు నామినేషన్ ఫీజుగా రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను గుర్తించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు పార్టీ తెలిపింది.
అవినీతి నిర్మూలన, మతతత్వంపై పోరాటమే లక్ష్యంగా 2018 ఫిబ్రవరి 21న ఎంఎన్ఎం పార్టీని కమల్‌హాసన్ ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని కూటమితో కలిసి ఎంఎన్ఎం పోటీ చేయనుంది. 2025 జూలై 25న కమల్‌హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం