Home » France
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. శనివారం కెనడా హైకమిషనర్‌తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులకి సంబంధించిన పలు కీలక విషయాలపై కెనడా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
జారి కిందపడుతున్నా సరే అతడు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. పైకి లేచి మళ్లీ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాదాపు 30 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. అపోలో గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచి విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ ముదిరింది. ఇటీవల నియమితుడైన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను (Sebastien Lecornu) తన మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రాజీనామా చేశారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కాన్వాయ్ కూడా నిలిచిపోవడంతో చివరకు మాక్రాన్ ట్రంప్‌కు కాల్ చేసినట్టు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రపంచ దేశాల్లో అవినీతి, చేతకాని ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. నిన్న నేపాల్, నేడు ఫ్రాన్స్ అడ్డుడికిపోతోంది.'ప్రతిదీ బ్లాక్ చేయి' నినాదంతో ఫ్రాన్స్ దేశంలో ఆరని నిరసన మంటలు మండుతున్నాయి.
మాక్రాన్‌తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధాని మోదీ పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య అనుబంధాన్ని బలపరిచేలా, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై శాంతియుత పరిష్కారాల దిశగా ఈ సంభాషణ సాగింది.
ఫాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని అన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ మండిపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని హితవు పలికింది.
Satanic Child Sacrifice: ఎడారిలోకి వెళ్లడానికి 2023 చివర్లో ఓ కారు కొన్నారు. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఓ బంధువు కారణంగా వారి ప్లాన్ ఫెయిల్ అయింది. ఇద్దరూ జైలు అయ్యారు.