Share News

మెక్రాన్ ఏం సందేశం ఇస్తున్నారు.. సన్ గ్లాసెస్‌పై తీవ్ర చర్చ..

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:40 PM

దావోస్ సమిట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకోవటంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందిస్తూ.. ‘సన్ గ్లాసెస్‌తో కనిపించినందుకు క్షమించండి. నా కంటికి చిన్న సమస్య వచ్చింది. అందుకే గ్లాసెస్ పెట్టుకున్నా’ అని అన్నారు.

మెక్రాన్ ఏం సందేశం ఇస్తున్నారు.. సన్ గ్లాసెస్‌పై తీవ్ర చర్చ..
Macron sunglasses

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మంగళవారం దావోస్ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 8 యూరోపియన్ దేశాలపై అధిక టారిఫ్‌లు విధిస్తామంటూ బెదిరించడాన్ని తప్పబట్టారు. దావోస్ సమిట్‌లో మెక్రాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు.. సమిట్ సందర్భంగా ఆయన ‘బ్లూ రిఫ్లెక్టివ్ సన్ గ్లాసెస్’ ధరించటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇండోర్‌లో ఉండగా.. అది కూడా వరల్డ్ లీడర్ల ముందు ప్రసంగిస్తూ ఆయన సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు.


దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మెక్రాన్ ఎందుకు సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఏదైనా మెసేజ్ ఇస్తున్నారా? లేకపోతే ఫ్యాషన్ కోసం పెట్టుకున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చర్చలకు స్వయంగా మెక్రానే పులుస్టాప్ పెట్టారు. సన్ గ్లాసెస్ పెట్టుకోవటంపై ఆయన స్పందిస్తూ.. ‘సన్ గ్లాసెస్‌తో కనిపించినందుకు క్షమించండి. నా కంటికి చిన్న సమస్య వచ్చింది. అందుకే గ్లాసెస్ పెట్టుకున్నా’ అని అన్నారు. తన కంటి సమస్యపై ఆయన కొన్ని జోకులు కూడా వేశారు. తనకొచ్చిన సమస్యను ‘ఐ ఆఫ్ ది టైగర్’ అని జోక్ చేశారు.


ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో గిల్ టీ20 కెప్టెన్ అవుతాడు.. ఆసీస్ మాజీ కెప్టెన్

ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం

Updated Date - Jan 21 , 2026 | 06:28 PM