నైజీరియా గనిలో విషాదం.. విషవాయువు లీక్ కావడంతో 37 మంది మృతి..
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:34 PM
నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. ఆ విష వాయువులను పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. ఆ విష వాయువులను పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు (Nigeria toxic gas leak).
నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రంలోని ఓ గనిలో ఆకస్మికంగా లెడ్ ఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌లు లీక్ అయ్యాయి. ఈ వాయువులు మానవాళికి విషపూరితమైనవి. పైగా గనిలో వెంటిలేషన్ కూడా తక్కువగా ఉండడంతో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ విష వాయువులను పీల్చి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు (mining site accident Nigeria).
నైజీరియా సర్కారు ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది (37 killed Nigeria mine). గనిలో విష వాయువులు లీకవుతాయనే విషయంలో అవగాహన లేకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి మంత్రి చెప్పారు. ప్రమాదానికి కారణమైన గని సక్రమమైనదా, అక్రమమైనదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం..
మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ కుక్కలకు కావాల్సిన ఎముక ఎక్కడుందో 12 సెకెన్లలో గుర్తించండి..