బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..
ABN , Publish Date - Feb 13 , 2026 | 07:21 AM
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సత్తా చాటుతోంది. 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోనీ బీఎన్‌పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తారిక్ రెహ్మాన్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సత్తా చాటుతోంది. 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తారిక్ రెహ్మాన్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. గురువారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య బంగ్లాదేశ్‌లోని 299 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 12.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 50 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం (Bangladesh Election 2026).
దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంటరీ స్థానాల్లో 1,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గురువారం అర్ధరాత్రి సమయానికి బీఎన్‌పీ 175 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ కేవలం 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖాలిదా జియా కుమారుడైన తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీపై బంగ్లా ప్రజలు విశ్వాసం ప్రకటించారు. విదేశాలలో నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులు కూడా మొదటిసారిగా పోస్టల్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు (BNP Tarique Rahman).
దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు రెండు రాజవంశాల చుట్టే తిరుగుతున్నాయి (Bangladesh vote counting). ఒకవైపు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్, మరోవైపు మాజీ ప్రధాని ఖాలిదా జియా స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కీలకంగా ఉన్నాయి. 2024 జులైలో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం బీఎన్‌పీకి ప్రత్యర్థిగా జమాత్-ఏ-ఇస్లామి నేతృత్వంలోని 11 పార్టీల సంకీర్ణ కూటమి పోటీ చేసింది.
గతేడాది డిసెంబర్‌లో ఖాలిదా జియా మరణించారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన ఆమె కుమారుడు తారిక్ రెహ్మాన్ బీఎన్‌పీ సారథ్యం స్వీకరించి పార్టీని విజయం దిశగా నడిపించారు. ఆయనే బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనబడుతోంది.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు