Share News

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:05 PM

పార్లమెంటులో ఇటీవల విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీని సభకు రావొద్దొని సూచించినట్టు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఆయన నిందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు
Congress MPs in Speaker OM Birla chamber

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీని సభకు రావొద్దొని సూచించినట్టు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఆయన నిందించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తాజాగా షేర్ చేశారు.


'ఇది కాంగ్రెస్ ఎంపీ ఒకరు చట్టవిరుద్ధంగా తీసిన వీడియో. 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఆయనను దుర్భాషలాడారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీపై కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ చర్చలను మాత్రమే ప్రోత్సహిస్తుంది. ఎంపీలు ఇలా బెదరింపులకు పాల్పడటాన్ని ఎన్నడూ ప్రోత్సహించదు' అని రిజిజు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీడియోలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, వీరిలో ఎక్కువ మంది మహిళా ఎంపీలు కనిపిస్తున్నారు. స్పీకర్ తన సీటులో కూర్చుని ఉండగా, ఆయన పక్కన కిరణ్ రిజిజు కూడా ఉన్నారు.


కాగా, గత వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రిజిజు వెంటనే మీడియాతో మాట్లాడుతూ, జరిగిన ఘటనతో స్పీకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. 'వాళ్లు (కాంగ్రెస్ ఎంపీలు) స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనను దూషించారు. సభలో స్పీకర్ రూలింగ్ ఇచ్చినప్పుడు వాళ్లు పాటించలేదు. తాను మాట్లాడేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రాహుల్ అంటున్నారు. అయితే స్పీకర్ అనుమతి లేకుండా సభలో ఎవరూ మాట్లాడకూడదు' అని అన్నారు. ఛాంబర్‌లో నిరసన తెలుపుతున్న ఎంపీలను ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రోత్సహించారని కూడా రిజిజు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. ఎంపీలు కేవలం తమ సమస్యలను చెప్పుకున్నారని, శాంతియుతంగానే ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్‌పై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత..

జల్లికట్టులో తీవ్ర విషాదం.. యువకుడి మృతి.. 26 మందికి గాయాలు..

Updated Date - Feb 12 , 2026 | 03:55 PM