అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తాం
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:50 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ చీఫ్ నయినార్ ధీమా
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల డీఎంకే పాలనలో ప్రజలంతా తీవ్రంగా నష్టపోయారని, ఈ ఎన్నికల్లో పార్టీని చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. డీఎంకే చరిత్రలో వరుసగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు భయం పట్టుకుందని,
అందుకే అధికారంలో భాగస్వామం గురించి మాట్లాడుతున్నారని, అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన సోదరసమానుడని చెబుతూనే అధికారంలో భాగస్వామ్యం సససేమిరా కుదరదని మెండివైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పా డి పళనిస్వామి (ఈపీఎస్) నేతృత్వంలోని ఎన్డీయే 200లకు పైగా సీట్లలో గెలవటం తథ్యమ ని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమాత్రం నిధులివ్వలేదని చెబుతున్న స్టాలిన్ ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం మునుపటి యూపీఏ ప్రభుత్వం కంటే 300 రెట్లు అధికంగా అంటే సుమారు రూ.14 లక్షల కోట్ల మేరకు నిధులిచ్చిందని నయినార్ నాగేంద్రన్ అన్నారు.
ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు...
బీజేపీ తరఫున తన అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసినట్లు నయినార్ నాగేంద్రన్ తెలిపారు. తనతోపాటు ఆ కమిటీకి ఆర్గనైజర్‌గా పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ పొన్ రాధాకృష్ణన్, డిప్యూటీ ఆర్గనైజర్లుగా పార్టీ రాష్ట్ర కమిటీ కోశాధికారి ఎస్‌ఆర్ శేఖర్, ఉపాధ్యక్షులు ఆర్‌ఎన్ జయప్రకాష్, ఎం. వెంకటేశన్, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి మాలా సెల్వకుమార్, రామప్రియన్ ఉన్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!
Read Latest Telangana News and National News