Home » Assembly elections
టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ తారాపురం, మధురాంతకం నియోజకవర్గాల్లో రెండు రోజుల చొప్పున పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం స్పష్టతనిచ్చారు. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని.. అప్పులు పాలు చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునని ఆయన విమర్శించారు. పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది.
మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.
తమిళనాడులో ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విజయ్‌కు చెందిన TVK పార్టీకి మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై చర్చించడానికి విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భగా ఆ రాష్ట్ర గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టారని, అయినాకాని, విజయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అదే న్యాయమని చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.