Share News

TVK Vijay: 10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 10:48 AM

తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించారు. ఎన్నికల ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

TVK Vijay: 10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ
Vijay

చెన్నై: తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న తమిళగ వెట్రి కళగం(TVK) అధ్యక్షుడు విజయ్(Vijay) కీలకమైన ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించారు. ఎన్నికల ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 10 మంది సభ్యులతో ఈ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు.


పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, జనరల్ సెక్రటరీ(ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్) ఆదవ్ అర్జున, పార్టీ హై-లెవల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్ కేఏ.సెంగోట్టియన్‌తో పాటు ఎ.పార్తీబన్, బి.రాజ్‌కుమార్, కేవీ.విజయ్ దాము, ఎస్‌పీ.సెల్వమ్, కె.పిచాయ్ రత్నం కరికాలన్, ఎం.సెరవు మొహిదీన్ అలియాస్ నియాస్, జే.కేథరిన్ పాండియన్ సభ్యులుగా ఉంటారని విజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి వ్యవహారాలు ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. కొత్తగా ఏర్పటైన కమిటీకి పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు పూర్తి సహకారం అందించాలని విజయ్ కోరారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

‘ఐ ప్యాక్‌’లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2026 | 11:25 AM