Road Transport Ministry: ఏప్రిల్ 1 నుంచి టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్..!
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:07 AM
ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది.
న్యూఢిల్లీ, జనవరి 16: ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ చార్జీలను కచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలైన్లు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సాఫీగా కొనసాగించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఈ ‘నో స్టాఫ్’ వ్యవస్థను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 25 టోల్‌ప్లాజాల్లో అమలు చేసి పరీక్షిస్తున్నారు.