Home » Tamil Nadu
సునామీ వచ్చి 21 సంవత్సరాలు పూర్తయింది. ఆ పెను విషాదాన్ని తీరం వాసులు ఇప్పటికీ మరువలేకనొతున్నారు. సునామీ జలప్రళయం వచ్చి 21 ఏళ్లు గడిచిన సందర్భంగా శుక్రవారం తమ వారికి తీరం వెంబడి కన్నీటితో అంజలి ఘటించారు. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంట నివాళుర్పించారు.
నేను, నాన్న కరుణానిధి క్రికెట్ లవర్స్ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... కరుణానిధి క్రికెట్ పోటీలను స్టేడియంకు వెళ్ళి ఆసక్తిగా తిలకించేవారని గుర్తు చేశారు. అలాగే... క్రికెట్లో ధోనీ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువవుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పాఠశాలలో క్షుద్రపూజలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా.. సమాచారమందుకున్న పోలీసులు పాఠశాలను సందర్శించి విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్కుమార్ తెలిపారు. అలాగే... తమిళగ వెట్రి కళగం అని పూర్తిగా చెబితే తనకు అర్ధం కావడం లేదని, టీవీకే, ఈవీకే, ఎంవీకే అని చెబితే అర్ధమవుతుందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం,
క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-వేలాంకణి మధ్య మంగళవారం) రాత్రి 7.25గంటలకు ఓ రైలు. అలాగే.. బుధవారం సాయంత్రం 5.30గంటలకు మరో రైలు వేలాంకణికి బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలో 2017 ఏప్రిల్ 23న కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు జారీ అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్ పేరుతో విలాసవంతమైన భవనం ఉండగా సెక్యూరిటీ గార్డును హతమార్చి అందులోని నగదు, నగలు ఎత్తుకెళ్లారనే విమర్శలొచ్చాయి.