Share News

‘ఇంటి దీపం’ ఆరిపోతుందని..!

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:12 PM

ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్‌ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు.

‘ఇంటి దీపం’ ఆరిపోతుందని..!

  • భార్యా పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న భర్త

  • తండ్రి, కుమారుడి మృతి

  • తల్లి, కుమార్తె పరిస్థితి విషమం

చెన్నై: ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్‌ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు మృతి చెందగా, క్యాన్సర్‌ బాధితురాలైన తల్లి, వారి కుమార్తె మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానిక పెరంబూరులో ఈ ఘటనలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా...


పెరంబూర్‌ శంకరమఠం ప్రాంతంలో నివశిస్తున్న సెబాస్టియన్‌ (43) ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రెక్సీ బ్యూలా (38), కుమార్తె ఇవాంజెలిన్‌ అల్వినా (8), కుమారుడు యువన్‌ ఆండో (4) ఉన్నారు. విరుదుచలానికి చెందిన సెబాస్టియన్‌ పదేళ్లుగా నగరంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో రెక్సీ బ్యూలాకు క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. లక్షలు పోసి వైద్యం చేయించినా ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంత్లో సెబాస్టియన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానని, తాము లేకుంటే తమ పిల్లల బతుకు ఏమవుతుందోనని పలుమార్లు తమ బంధువుల వద్ద వాపోయాడు.


కాగా మంగళవారం రాత్రి కేక్‌ ఆర్డర్‌ చేసిన సెబాస్టియన్‌, దానిపై ‘హ్యాపీ ఫ్యామిలీ డే’ అని రాయించాడు. కేక్‌ ఇంటికి తీసుకొచ్చి, దానిలో విషం కలిపి, దానిని భార్యా, పిల్లలతో కట్‌ చేయించి తినిపించాడు. కేక్‌ తిన్న ముగ్గురూ స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో, బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెక్సీబ్యూలా చెన్నై పోలీసుకంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి.. ‘నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మా కుటుంబంలో అందరూ స్పృహకోల్పోయారు’ అని చెప్పి, తన కూతురికి ఫోన్‌ ఇచ్చింది. కుమార్తె ఏడుస్తూ.. ‘మా నాన్న చనిపోయాడు. వచ్చి మమ్మల్ని రక్షించండి’ అంటూ కేకలేసింది.


nani2.2.jpgఅనంతరం కంట్రోల్‌ రూమ్‌ నుంచి అందిన సమాచారంతో సెంబియం సీఐ చిరంజీవి తనసిబ్బందితో బ్యూలీ ఇంటికివెళ్లగా, అక్కడ సెబాస్టియన్‌ ఉరికి వేలాడుతూ కనిపించగా, సమీపం లో భార్య, కుమార్తె,కుమారుడు స్పృహకోల్పోయి వున్నారు. హూటాహూటిన వారిని పెరియార్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారుడు యువన్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అక్కడ బ్యూ లా, అల్వినాకు ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.


వారిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పోలీసులు ప్రాథమిక విచారణలో అసలు విషయం బయల్పడింది. భార్య క్యాన్సర్‌తో మృతిచెందుతుందని తెలిసిన సెబాస్టిన్‌.. ఆమెతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, కేక్‌లో విషయం కలిపాడు. ఆ ముగ్గురూ స్పృహ కోల్పోవడంతో చనిపోయారని భావించి, తనూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 12 , 2026 | 01:15 PM