బంగారం కిందకు.. వెండి పైకి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 10:45 AM
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర కిందకు వచ్చింది. ఇటీవల క్రమంగా తగ్గుతూ వచ్చిన వెండి ధర మళ్లీ పైకి ఎగసింది. చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. బంగారం గ్రాముకు రూ.1200 మేర తగ్గింది. వెండి కిలోకు రూ.5000 పెరిగింది (Gold prices Live).
ఈ రోజు (ఫిబ్రవరి 12న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,400కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,200 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200కి చేరింది (Live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,100 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,58,550కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,45,350కి చేరుకుంది.
ఇక, వెండి చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది (Silver Rates Live). మళ్లీ రూ.3 లక్షల మార్క్‌కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.5 వేల మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
వామ్మో.. ఇదెక్కడి వార్నింగ్.. ధూమపానం గురించి ఈ పెట్రోల్ బంక్ యజమాని ఏం చెప్పాడో చూడండి..