వామ్మో.. ఇదెక్కడి వార్నింగ్.. ధూమపానం గురించి ఈ పెట్రోల్ బంక్ యజమాని ఏం రాశాడో చూడండి..
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:48 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వెరైటీ ఆలోచనలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వెరైటీ ఆలోచనలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ 'నో స్మోకింగ్' బోర్డుకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (petrol pump owner viral video).
ధూమపానం చేయవద్దనే వార్నింగ్ బోర్డ్‌లను మనం చాలా చోట్ల చూస్తుంటాం. ధూమపానం వల్ల ఆరోగ్యం పాడవుతుందనే హెచ్చరికలు అలాంటి వాటిపై రాస్తారు. అయితే ఓ పెట్రోల్ బంక్ యజమాని ఏం రాశాడో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. @FI_InvestIndia అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెట్రోల్ బంక్ కనిపిస్తోంది. ఆ బంక్‌లో 'నో స్మోకింగ్' బోర్డును వేలాడదీశారు. అయితే దాని కింద 'ధూమపానం చేయకండి.. మీ జీవితానికి ఎటువంటి విలువా లేకపోవచ్చు. కానీ, మా పెట్రోల్ చాలా ఖరీదైనది' అని రాశారు (warning sign at petrol pump).
ఒక వ్యక్తి ఆ సైన్ బోర్డ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (petrol bunk safety message). ఆ పెట్రోల్ బంక్ యజమానికి అవార్డు ఇవ్వాలని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సూటిగా నిజం చెప్పేశాడని ఒకరు మెచ్చుకున్నారు. స్మోకింగ్ చేసే వారిని ఇంత కంటే ఎవరూ ట్రోల్ చేయలేరని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..