Share News

పొరపాటు జరిగింది, చింతిస్తున్నా.. త్రిషపై వ్యాఖ్యలకు నయినార్ నాగేంద్రన్

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:09 PM

టీవీకే అధ్యక్షుడు విజయ్‌‌ను విమర్శించే క్రమంలో నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు తెలిపారు.

పొరపాటు జరిగింది, చింతిస్తున్నా.. త్రిషపై వ్యాఖ్యలకు నయినార్ నాగేంద్రన్
Ninar Nagendra and Actor Trishna

చెన్నై: టీవీకే అధ్యక్షుడు విజయ్‌ (Vijay)ను విమర్శించే క్రమంలో నటి త్రిష (Trisha)పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (Ninar Nagendran) క్షమాపణలు తెలిపారు. ఎవరినీ బాధ పట్టే ఉద్యేశం తనకులేదని, పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని, అందుకు చింతిస్తున్నానని చెప్పారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. అయితే ఆరోజు తాను ఆ నిబంధనను అత్రికమించానని తెలిపారు. దీనిపై వివాదం రేగడంతో బీజేపీ కోయంబత్తూరు (సౌత్) ఎమ్మెల్యే వనతి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తనతో ఈ విషయం చర్చించారని, తాను అన్న మాటలకు చింతిస్తున్నానని నాగేంద్రన్ తెలిపారు.


అసలేం జరిగిందంటే..

సొంతంగా పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా అంటూ విజయ్ విసిరిన సవాలుపై నాగేంద్రన్‌ను మీడియా ఇటీవల ప్రశ్నించింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ, విజయ్‌కు అనుభవం లేదని, ముందు త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధం కలిగి ఉండాలని విమర్శించారు. ఆయన మాటలతో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నైజం ఏమిటో నాగేంద్రన్ మాటలను బట్టే చెప్పవచ్చంటూ డీఎంకే విమర్శలు గుప్పించింది.


కాగా, నాగేంద్ర వ్యాఖ్యలను త్రిష తరఫున న్యాయవాది తప్పుపట్టారు. బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమలో నాగేంద్రన్ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

థరూర్‌కు మంత్రి పదవి కావాలి, పవన్ ఖేరా కీలుకొమ్మ... మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

Updated Date - Feb 16 , 2026 | 09:52 PM