తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:56 AM
తమిళనాడు ప్రభుత్వం మహిళకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో తలో రూ.5 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ కీలక సందేశాన్ని ఇచ్చారు.
చెన్నై, ఫిబ్రవరి 14: తమిళనాడు(Tamil Naidu) ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.31 కోట్ల మంది మహిళలకు రూ.5 వేల చొప్పున విడుదల చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం ఈ నగదు జమ అయింది. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ చేసిన మోసాలను, కుట్రలను అధిగమించి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. 2023 సెప్టెంబరు నుంచి ప్రతి నెలా మహిళలకు రూ.వెయ్యి అందించే ‘కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై’ పథకాన్ని(Kalaignar Magalir Urimai Scheme) విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మొదట 1.13 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందగా ప్రస్తుతం ఈ పథకాన్ని 1.31 కోట్ల మందికి విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 నెలలకు ఈ నగదు వేయకుండా నిలిపివేసేందుకు కొందరు కుట్ర చేస్తూ కోర్టులో పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
మార్చి, ఏప్రిల్, మే నెలలకు రూ.3వేలు, అలానే వేసవి ఖర్చుల దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీగా అదనంగా రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.5 వేలు మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.31 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. త్వరలో ద్రవిడ మోడల్ 2.0 ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద ప్రతినెలా అందించే మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతామని తన ‘ఎక్స్’ అకౌంట్లో సీఎం స్థాలిన్(MK Stalin) వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
స్టాలిన్ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి