Udayanidhi Stalin: బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:12 PM
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.
- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: బలహీనంగా ఉన్నప్పటికీ, అన్నాడీఎంకే మా ప్రత్యర్ధి అని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi Stalin) స్పష్టం చేశారు. ఆయన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపారు. అన్నాడీఎంకే చాలాకాలంగా మాకు ప్రధాన పోటీదారైనప్పటికీ, ప్రస్తుతానికి బలమైన పోటీదారుడు లేడనే అనుకుంటున్నానన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బలహీనంగా ఉన్నా, దానిని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చూస్తున్నామని, వారే మాకు పోటీ అన్నారు.
బీజేపీ, ఆ పార్టీ బి జట్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో లౌకిక శక్తులను బలహీనపరిచేలా బీజేపీ అన్ని విధాల ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ కుట్రలు గ్రహించి వారిని ఓడిస్తారన్నారు. ఈ కూటమిలోని అన్ని పార్టీలను తాము గౌరవిస్తున్నామని, వారి అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నామన్నారు.

ఎన్డీఏ కూటమిలో నిర్ణయాలు ఢిల్లీలో తీసుకుని రాష్ట్ర పార్టీలపై రుద్దుతున్నారని విమర్శించారు.. పార్టీ నాయకుడు స్టాలిన్ యువజన విభాగాన్ని ప్రారంభించి చాలాకాలం దానికి నాయకత్వం వహించారన్నారు. యువతకు సాధికారికత కల్పించడం, భవిష్యత్తు కోసం వారి సిద్ధం చేయడం, యువత ప్రాముఖ్యత తదితరాలను మా నాయకుడు గుర్తించారని తెలిపార
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News